Homeహైదరాబాద్latest NewsALERT: బయట షవర్మా తింటున్నారా? అయితే జాగ్రత్త.. ప్రాణాలకే ప్రమాదం..!

ALERT: బయట షవర్మా తింటున్నారా? అయితే జాగ్రత్త.. ప్రాణాలకే ప్రమాదం..!

నాన్ వెజ్ లవర్స్ చికెన్‌తో చేసిన వంటకాలంటే లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటుంటారు. ఈ మధ్య ప్రతి ఫుడ్ కోర్ట్ లో షవర్మా స్టాల్స్ వద్ద భారీగా క్యూ కట్టి మరీ వీటిని కొనుగోలు చేసి తింటున్నారు. రకరకాల షవర్మాలు అందరినీ నోరూరిస్తున్నాయి. కొందరు వ్యాపారులు ఇదే అదునుగా భావించి నిలవ ఉంచిన పదార్ధాలు, మాంసం, సాస్ ఉపయోగించి.. కనీస శుభ్రతా ప్రమాణాలు పాటించకుండా వీటిని తయారుచేసి అమ్ముతున్నాయి.

షవర్మాలో ప్రమాదకర బాక్టీరియా!
పానీపూరిలో క్యాన్సర్ కారకాలున్నట్లు గుర్తించిన కర్ణాటక ఆరోగ్య శాఖ మరో బాంబు పేల్చింది. షవర్మాలోనూ ఆరోగ్యానికి తీవ్ర హాని చేసే బాక్టీరియా ఉన్నట్లు వెల్లడించింది. 10 జిల్లాల నుంచి 17 షవర్మా శాంపిల్స్ సేకరించి పరిశీలించగా 8 షవర్మా శాంపిల్స్​లో ప్రమాదకర బాక్టీరియా ఉన్నట్లు తేలింది. అయితే కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ఫుడ్‌ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని నిషేధించిన విషయం తెలిసిందే.

ప్రాణాలు తీసిన చికెన్‌ షవర్మా!
గత నెలలో ముంబైలో ప్రతిమేశ్ భోక్సే (19) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ షాపులో షవర్మా తిన్నాడు. తిని ఇంటికి వెళ్లగానే అస్వస్థతకు గురై కడుపునొప్పితో వాంతులు చేసుకున్నాడు. మరుసటి రోజు వాంతులు ఆగకపోవడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. పాడైపోయిన చికెన్‌తో చేసిన షవర్మా తిన్న కారణంగానే ఆ యువకుడు చనిపోయినట్లు వైద్యులు తేల్చారు.

Recent

- Advertisment -spot_img