మార్కెట్ లో నకిలీ రూ.500 నోట్ల కలకలం నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన అదే చర్చ. ఫేక్ నోట్లు కూడా అసలైన నోటులాగే ఉండటంతో ఏది నిజమో? ఏది నకిలీయో అర్థం కాక ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఇక్కడ చెప్పిన విధంగా చెక్ చేస్తే మీరు ఈజీగా నకిలీ నోట్ ని గుర్తు పట్టవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. రూ.500 నోటుపై ఉన్న గ్రీన్ కలర్ స్ట్రిప్ ను గమనించింది. దాని కాస్త క్రాస్ గా చూస్తే బ్లూ కలర్ లో కనిపిస్తే అది నిజమైన నోట్. ఒక వేళ మారకుండా గ్రీన్ కలర్ లోనే ఉంటే అది ఫేక్. రూ.500 నోటుపై రైట్ సైడ్ వైపు ఉన్న నంబర్లు చిన్న సైజు నుంచి పెద్దగా ఉండాలి. అలా లేకపోతే అది ఫేక్. రూ.500 నోటు లెఫ్ట్ సైడ్ అడుగున ఉన్న బాక్సులో సరిగ్గా గమనిస్తే 500 అని రాసి ఉండాలి. అలా లేకపోతే ఫేక్. ఈ విధంగా మనం నకిలీ నోట్ ను గుర్తించవచ్చు.