ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పీజీ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు షాకిచ్చాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.16.5 పెంచాయి. 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం తెలంగాణలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.855, కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,044గా ఉంది. ఏపీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.827.50గా ఉంది