రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఏపీలోని పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. విజయవాడ రైల్వే డివిజన్ లో ట్రాక్ పనులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు విజయవాడ-విశాఖపట్నం మధ్య సామర్లకోట మీదగా నడిచే రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారిమళ్లించారు.
గుంటూరు-విశాఖ (22701), విశాఖ-గుంటూరు (22702), మచిలీపట్నం-విశాఖ(17219), విశాఖ-మచిలీపట్నం(17220) రైళ్లను రద్దు చేశారు. ధన్ బాద్-అలప్పూజ బొకారో ఎక్స్ ప్రెస్ (13351) గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదగా నడుస్తుంది. హతియా-బెంగళూరు(12835) ఏప్రిల్ 2, 7, 9, 14, 16, 21, 23, 28 తేదీల్లో నిడదవోలు, భీమవరం మీదుగా నడుస్తుంది. హతియా-బెంగళూరు(18637) ఏప్రిల్ 6, 13, 20, 27 తేదీల్లో నిడదవోలు, భీమవరం మీదుగా నడుస్తుంది. హతియా-ఎర్నాకుళం(22837) ఏప్రిల్ 1, 8, 15, 22 తేదీల్లో నిడదవోలు, భీమవరం మీదగా నడుస్తుంది. టాటా-యశ్వంత్‌పూర్ (18111) ఏప్రిల్ 4, 11, 18, 25 తేదీల్లో, జాసిడ్-తాంబరమ్ (12376) ఏప్రిల్ 3, 10, 17, 24 తేదీల్లో, ముంబై- భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) ఏప్రిల్ 1, 3, 5, 6, 8, 10, 12, 13, 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో విజయవాడ,గుడివాడ, భీమవరం టౌన్‌ల మీదుగా నిడదవోలు వస్తుంది. టాటా-ఎస్‌ఎంవీ బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ (12889) ఏప్రిల్ 5, 12, 19, 26 తేదీల్లో, ఎర్నాకుళం-పాట్నా ఎక్స్‌ప్రెస్ (22643) ఏప్రిల్ 12, 8, 15, 22 తేదీల్లో, భావ్ నగర్-కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ (12756) రైలు ఏప్రిల్ 6, 13, 20, 27 తేదీల్లో విజయవాడ, గుడివాడ, భీమవరంల మీదుగా నిడదవోలు చేరుతుంది.