ఏపీలో పాత మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీపైన కసరత్తు జరుగుతోంది. కొత్త ఎక్సైజ్ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు వేలం ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. మద్యం దుకాణాల సంఖ్య కూడా పెరిగే అవకాశముంది. ఏపీ ప్రభుత్వం తెచ్చే నూతన ఎక్సైజ్ విధానంలో ధరలు కూడా తగ్గించాలని నిర్ణయించిందట. అన్ని నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటుందని సమాచారం.