Homeహైదరాబాద్latest Newsమందుబాబులకు అలెర్ట్.. ఆ మూడు రోజులు వైన్స్ బంద్..!

మందుబాబులకు అలెర్ట్.. ఆ మూడు రోజులు వైన్స్ బంద్..!

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 4 న కౌంటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను తెరవొద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img