నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పెయిడ్పార్కింగ్ విషయంలో కొద్దినెలలుగా దోబూచులాడుతున్న ఎల్అండ్ టీ ఎట్టకేలకు నేటి నుంచి అమలు చేయనుంది. గతంలో మూడుసార్లు బోర్డులు ఏర్పాటు చేసి, ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఈ నెల 26న ఆయా స్టేషన్లలో పెయిడ్పార్కింగ్ తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి, ప్రస్తుతం పార్కింగ్ ఏరియాలో చార్జీలబోర్డులు ఏర్పాటు చేసింది. గత చార్జీల బోర్టుతో పోలిస్తే కొంత తగ్గించింది.