Homeహైదరాబాద్latest Newsవాహనదారులకు అలర్ట్.. నేడు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

వాహనదారులకు అలర్ట్.. నేడు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

నేడు ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం ఆవరణలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. పలు జంక్షన్లలో వాహనాలను దారి మళ్లిస్తారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు. అయితే ప్రధాని మోదీ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ షాపర్‌స్టాప్, హెచ్‌పీఎస్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్‌లోని ఎడమవైపు రాజీవ్ గాంధీ విగ్రహం, యశోద హాస్పిటల్, రాజ్‌భవన్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్, రవీంద్రభారతి జంక్షన్, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌, ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ మీదుగా ఎల్బీ స్టేడియానికి వెళ్లనున్నారు. సభ అనంతరం తిరిగి ఈ మార్గంలో బేగంపేటకు చేరుకుంటారు.

Recent

- Advertisment -spot_img