తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లను డిసెంబర్ 9 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని TGPSC తెలిపింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 783 గ్రూప్- 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.