Homeహైదరాబాద్latest NewsTG Inter Results: విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. డేట్ ఫిక్స్..?

TG Inter Results: విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. డేట్ ఫిక్స్..?

TG Inter Results: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) 2025 సంవత్సరానికి సంబంధించిన మొదటి మరియు రెండవ సంవత్సరం ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ నెల చివరి వారంలో ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. మొదట ఏప్రిల్ 15న ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు భావించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల తేదీ కొంత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 24 నుంచి 27 మధ్యలో ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారని తెలుస్తుంది.

పరీక్షల వివరాలు:

  • మొదటి సంవత్సరం: మార్చి 5 నుంచి మార్చి 24, 2025 వరకు.
  • రెండవ సంవత్సరం: మార్చి 6 నుంచి మార్చి 25, 2025 వరకు.
  • పరీక్షకు హాజరైన విద్యార్థులు: మొత్తం 9,96,971 మంది.

ఫలితాలు చెక్ చేసే విధానం:

  • అధికారిక వెబ్‌సైట్లు: tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in.
  • విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి ఫలితాలను చూడవచ్చు.

Recent

- Advertisment -spot_img