తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఆదివారం కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సిటీ పోలీసులు తెలిపారు. నెక్లెస్ రోడ్ రోటరీ, సైఫాబాద్ పోలీసుస్టేషన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, కడాలబావి జంక్షన్, కవాడిగూడ, డీబీఆర్ మిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. దీంతో ఆ మార్గాల వైపు కొత్త మార్గాలు చూసుకోవాలని పోలీసులు చెబుతున్నారు.