తెలంగాణలోని గిరిజన, బీసీ, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరం 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రేపటి నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక ఫోన్ సంబర్ తో ఒక దరఖాస్తు చేయాలి. రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పాత జిల్లా యూనిట్ గా ఎంపిక చేస్తారు. FEB 23వ తేదీన ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు 040-23391598, 9491063511 నెంబర్లను సంప్రదించవచ్చు.