మైక్రోసాఫ్ట్ విండోస్‌లోని సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగించింది. న్యూజిలాండ్‌లోని ఎన్ఏబీ, కామన్వెల్త్, బెండిగో తదితర బ్యాంకులు ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయినట్లు వెల్లడించాయి. కంప్యూటర్ వ్యవస్థలకు యాక్సెస్ కోల్పోవడంతో బ్యాంకు సేవలకు అంతరాయం కలిగిందని ఆస్ట్రేలియాలోని వార్తా సంస్థలు తెలిపాయి. దక్షిణాఫ్రికా అతిపెద్ద బ్యాంకు కాపిటెక్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది.