ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం యథావిధిగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. పరీక్ష వాయిదా వేశారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీపీఎస్సీ మరోసారి తేల్చి చెప్పింది. 175 కేంద్రాల్లో 92,250 మంది పరీక్ష రాయనున్నారు. ఉ.10 నుంచి మ.12.30 గంటల వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 గంటల వరకు పేపర్-2 జరగనుంది. అభ్యర్థులు 30 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలి.