రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్న సమయంలో తిరుమలలో మాత్రం భారీ వర్షం కురిసింది. భారీగా వర్షం కురవడంతో తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. విపరీతమైన ఎండలతో ఇబ్బంది పడిన భక్తులు వర్షం రావటంతో ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందారు. తిరుమలో వరుసగా మూడో రోజు వర్షం కురవడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కొండపై భారీ వర్షం కురిసినప్పటికీ… కింద తిరుపతిలో వర్షం లేకపోవడం గమనార్హం.