ఏపీలో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. విపత్తుల సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఫోన్ చేయాలని సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. సహాయక చర్యల కోసం అధికారులను అప్రమత్తం చేసింది.