OYO రూమ్లలో ఐడెంటిటీ ప్రూఫ్ కోసం చాలా మంది ఆధార్ కార్డు ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల మోసానికి గురయ్యే ప్రమాదం ఉందని, ఆధార్ డేటాను దొంగిలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హోటల్ బుకింగ్ సమయంలో మాస్క్ ఆధార్ కార్డును ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇందులో ఆధార్ నంబర్లోని మొదటి 8 నంబర్లు కనిపించవని, చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయని పేర్కొన్నారు. దీంతో ఈ వివరాలు సురక్షితంగా ఉంటాయన్నారు.