చాలా మంది పూజ చేసేటప్పుడు అగరుబత్తీలను వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ అగరుబత్తీల వాసన ఎంత ఆధ్యాత్మికమైందో, అంతే ప్రమాదకరమైనదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అగరుబత్తీల నుంచి వెలువడే పొగ ఇంట్లో పొల్యూషన్లా మారుతుందని, దీని పేరే కార్బన్ మోనాక్సైడ్ అని చెబుతున్నారు. దీనిని పీల్చడం వల్ల శ్వాసకోశ క్యాన్సర్ వస్తుంది. ఇంకా గుండె సమస్యకు దారితీస్తుంది. అగరుబత్తీల వాసన పీల్చడం వల్ల తలనొప్పి, ఏకాగ్రత తగ్గడం, మతిమరుపు పెరుగుతుందని అంటున్నారు.