ఓఎల్‌ఎక్స్ తరహా మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విధానంలో మొదట నేరస్థులు వాహనం అమ్మకానికి ఉందని ప్రకటన ఇస్తారు. అనంతరం ఆసక్తి ఉన్న వారు అప్రోచ్ కాగానే.. వాహనం ఎయిర్ పోర్ట్ పార్కింగ్‌లో ఉందని, రవాణా ఛార్జీలు పంపిస్తే వాహనం అందిస్తామంటూ నమ్మిస్తారు. డబ్బులు పంపగానే, మరో కారణం చెప్పి మరికొంత లాగుతారు. ఇలా అందినకాడికి దోచుకొని తర్వాత ఫోన్ స్విచాఫ్ చేస్తారు.