వివిధ వేడుకలు, పార్టీల్లో మద్యం సేవించే వారిపై ఎక్సైజ్ శాఖ నిఘాను విస్తృతం చేస్తోంది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌డిపిఎల్) వినియోగంపై ఇప్పటికే దాడులు నిర్వహిస్తుండగా, ఇప్పుడు ప్రత్యేక బృందాలను మోహరించనున్నారు. ఎన్‌డీపీఎల్ మద్యం వినియోగించడంపై ఈ ఏడాది 302 కేసులు నమోదు చేశారు. 165మందిని నిందితులుగా చేర్చి 35 వాహనాలను, రూ.61.13 లక్షల విలువైన మద్యాన్ని జప్తు చేశారు.