తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతు పవన ద్రోణి ప్రభావంతో 3 రోజులు కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ , రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.