జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలోని వాహనదారులకు కీలక అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. ఇకపై థర్ఢ్ పార్టీ బీమా లేకుండా నడిపే వాహనాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించింది. ఇందుకోసం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా బీమా పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది.