సికింద్రాబాద్ పరిధిలోని పూణే డివిజన్‌లో వచ్చే 3రోజులు పలు ట్రైన్స్ రద్దయ్యాయి. పూణే డివిజన్‌లో జులై 29నుంచి 31వరకు 62 రైళ్లు రద్దయ్యాయి. దౌండ్‌లో ఇంటర్‌లాకింగ్ పనిని నిర్వహించడానికి సెంట్రల్ రైల్వే 3రోజులపాటు పలు రైళ్లను రద్దు చేసింది. ఈ క్రమంలో జులై 29న మొత్తం 15 రైళ్లు, జులై 30న 23రైళ్లు, జులై 31న 24 రైళ్లు రద్దు కానున్నాయి.