స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు అలర్ట్. మీ ఎస్బీఐ ఖాతాకు రివార్డ్స్ పాయింట్స్ ఉన్నాయని, వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండంటూ ఓ ఫేక్ మెసేజ్ తాజాగా సర్య్యూలేట్ అవుతోంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రప్రభుత్వం హెచ్చరించింది. ఈ నకిలీ ఎస్‌ఎంఎస్‌లకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దని సూచించింది. ఈ మేరకు వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దని వెల్లడించింది.