ఇదే నిజం, ధర్మపురి రూరల్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం లో శనివారం రోజున 132KV సబ్ స్టేషన్ బుద్దేశ్ పల్లి లో మెంటేనెన్స్ పనులు ఉన్నందున జైన 33 KV గల (నక్కల పేట, జైన, దోనూరు, ) 33/11KV విద్యుత్ ఫీడర్లు కరెంటు సరఫరా ఉదయం 11: 00గ,, నుండి మధ్యానం 02: 00గ,, వరకు నిలిపివేయబడుతుందని విద్యుత్ అధికారులు తెలియజేశారు. కావున ఇట్టి సబ్ స్టేషన్ల కింద ఉన్న గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలుగును. దీనికి ప్రజలందరూ సహకరించాలని అధికారులు కోరారు.