ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో రేపు (10.01.2025) “ముక్కోటి ఏకాదశి” సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి వస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా దేవస్థానం వైపు వాహనాలకు అనుమతి లేదు, ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి, గోదావరి స్నానానికి భక్తుల అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది కావున ఈ రోజు అనగా 09.01.2025 రోజు సాయంత్రం 05.00 గంటల నుండి రేపు అనగా 10.01.2025 రోజున సాయంత్రం 05.00 గంటల వరకు బ్రాహ్మణ సంఘం, ఇసుక స్తంభం, నంది చౌరస్తా, వైశ్య సత్రంల నుండి వాహనాలు టెంపుల్ వైపుకు వాహనాలు అనుమతించబడవు, వాహనాల్లో వచ్చిన భక్తులు తమ యొక్క వాహనాలు నంది చౌరస్తా , హరిత హోటల్ సమీపంలో, కూరగాయల మార్కెట్ వద్ద, మంగల్ఘాట్ వద్ద, బ్రాహ్మణ సంఘం వద్ద ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలంలో వారి యొక్క వాహనాలు పార్కింగ్ చేసుకుని దైవదర్శనానికి గోదావరి స్నానానికి కాలినడకన వెళ్లాలి. ధర్మపురి మండల ప్రజలు తమ యొక్క వాహనాలు దేవస్థానం చుట్టుపక్కల పెట్టరాదని పోలీసు వారు సూచించిన పార్కింగ్ స్థలంలో పెట్టి పోలీస్ వారికి సహకరించగలరని ఏ రామ్ నరసింహారెడ్డి (సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ ధర్మపురి) తెలిపారు.