హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. కస్టమర్లకు కీలక సమాచారాన్ని తెలియజేసింది. తమ బ్యాంక్ యూపీఐ సేవలు ఈ నెలలో రెండు రోజులు అందుబాటులో ఉండవని ప్రకటించింది. సిస్టమ్ నిర్వహణ పనులు కారణంగానే ఈ సేవలు అందుబాటులో ఉండవని చెప్పింది. నవంబర్ 5న అర్ధరాత్రి 12 గంటల నుండి 2 గంటల వరకు, అలాగే నవంబర్ 23న అర్ధరాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు అంతరాయం ఉంటుందని వెల్లడించింది.