Homeహైదరాబాద్latest NewsAlert: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

Alert: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

ఏపీలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల 15వ తేదీలోపు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్ ప్రక్రియ నిన్నటితో ముగియగా, మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేయనున్నారు. ఇందుకు వారం రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు 10లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.

Recent

- Advertisment -spot_img