వర్షాకాలంలో ఇంట్లోకి ఈగలు వస్తుంటాయి వాటి శరీరం వ్యాధులను కలిగించే క్రిములకు నిలయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈగలు వాలిన ఆహారం తింటే టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈగ వేసే ప్రతి అడుగు బ్యాక్టీరియాను మనుషుల్లోకి బదిలీ చేయగలవని పరిశోధనలో తేలింది. ఈగలు రాకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించడంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.