Ali Marriage : ప్రముఖ తెలుగు హాస్య నటుడు అలీ (Ali Marriage) మళ్లీ పెళ్లి చేసుకున్నారు. కమెడియన్ అలీ ఇప్పటికే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. అలీ అటు సినిమాల్లోనూ టీవీ షోల్లో నటిస్తున్నాడు. అలీ మరోసారి తన భార్య జుబేదాను వివాహం చేసుకున్నాడు. అలీ పెళ్ళియై 30 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో అలీ పెళ్లి రోజుని తన కూతుర్లు ఘనంగా సెలెబ్రేట్ చేసారు. ఈ క్రమంలో అలీ, జుబేదాలా పెళ్లిని మరోసారి ముస్లిం వివాహ సంప్రదాయంలో కుటుంబ సభ్యులందరితో పిల్లలు ఘనంగా పెళ్లి చేసారు. అలీ భార్య జుబేదా ఈ పెళ్లి వేడుక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.