Alia Bhatt – Ranbir Kapoor Marriage : నెలలో అలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి
Alia Bhatt – Ranbir Kapoor Marriage : అలియా భట్, రణబీర్ కపూర్ ఈ ప్రేమ జంట ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందా? అని అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు.
ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న వీరి వివాహ వేడుక అతి త్వరలోనే సాకారం కానుందన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది.
ఈ జంట ఎప్పటి నుంచో చెట్టాపట్టాలేసుకు తిరుగుతోంది.
ఈ నెలలోనే వీరి వివాహం అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్టు సమాచారం.
ముంబైలోని చెంబూర్ లో ఆర్కే హౌస్ లో వేడుకకు ప్రణాళిక వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
గతంలో రాజస్థాన్ లోని ఉయద్ పూర్ లో వీరి వివాహ వేడుక ఉంటుందన్న వదంతులు రాగా, తాజాగా ముంబైలోనే ఇది ఉంటుందని సన్నిహిత వర్గాల సమాచారం.
వీరి వివాహ వేడుకపై అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు.
రణబీర్ కపూర్ తో అలియా భట్ బ్రహ్మాస్త్ర సినిమాలో త్వరలోనే కనిపించనుంది.
అలియాభట్ ఇటీవలే విడుదలైన సంచలనం సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ లో స్వల్ప నిడివి పాత్రతో తళుక్కుమనడం తెలిసిందే.