Homeహైదరాబాద్latest Newsఫోటోగ్రాఫర్లకు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చిన అలియా భట్ కూతురు.. వీడియో వైరల్..!

ఫోటోగ్రాఫర్లకు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చిన అలియా భట్ కూతురు.. వీడియో వైరల్..!

‘యానిమల్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రణబీర్ కపూర్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం రామమయం సినిమా చేస్తున్నాడు. అయితే స్టార్ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్ కూతురి క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాపని చూసి అందరూ ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ అని అంటున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలియా వివాహం చేసుకున్న అదే సంవత్సరం నవంబర్‌లో రాగా అనే పాపకు జన్మనిచ్చింది. అలియా భట్, హీరో రణబీర్ కపూర్ తమ కూతురితో కలిసి సెలవుల్లో భాగంగా కలిసి ముంబై విమానాశ్రయానికి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లకు టాటా చెప్పుతూ అలియా కూతురు నవ్వింది. అనంతరం ఫోటోగ్రాఫర్లకు అందరికి ఫ్లయింగ్‌ కిస్‌లు ఇచ్చింది. ఈ క్యూట్ వీడియో తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇది చూసిన పలువురు నెటిజన్లు అలియా భట్, రణబీర్ కపూర్ కూతురు అపుడే స్టార్ అయిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img