Homeహైదరాబాద్అన్ని మతాల సమానతే రాజ్యాంగ లక్ష్యం

అన్ని మతాల సమానతే రాజ్యాంగ లక్ష్యం

మేడిపల్లి, ఇదేనిజం:: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్​లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తిని సమాజానికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ఆదివారంతో 77వ వారంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో అన్ని మతాలు సమానంగా గౌరవించబడుతున్నాయన్నారు. అంటే దానికి కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణం కాబట్టి ఎవరు కూడా మత విద్వేషాలు పోకుండా అన్ని మతాల గౌరవించుకుంటూ మతసామరస్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని కోరారు, రామజన్మభూమి సంబంధించిన వివాదం కూడా సామరస్యంగా పరిష్కారం కావడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమే అని అని కొనియాడారు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి మహిళలు రావడం గొప్ప విషయమని మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి 33శాతం రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగం మహిళలకు అందించిన గొప్ప వరంగా పేర్కొన్నారు. మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సారిక, విజయ, బోడుప్పల్ టిఆర్ఎస్ కేవిబి అధ్యక్షులు ఎక్కిరాల లక్ష్మీ నరసయ్య, కామగల బాబు, బోడుప్పల్ ఏకలవ్య సంగం అధ్యక్షులు రాముల జ్ఞానేశ్వర్, జడ శ్రీనివాస్, మైసగళ్ళ శ్రీకాంత్, ఈతకోట గోపాలకృష్ణ, ఏ రాజేష్, బెక్కం శివ, ఏ అనిల్, నాగ శంకర్, శేకర్, బొల్లం శశి, షారుక్, పవన్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img