Homeహైదరాబాద్latest Newsవిజయ్ మూవీ శాటిలైట్ హక్కుల కోసం అన్ని కోట్లా..?

విజయ్ మూవీ శాటిలైట్ హక్కుల కోసం అన్ని కోట్లా..?

దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”. విజయ్ కెరీర్‌లో 68వ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా భారీ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం ఇప్పటికే ఓటిటిలో ఒప్పందాన్ని పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు శాటిలైట్ హక్కుల గురించి ఆసక్తికరమైన బజ్ విపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా తాలూకా హక్కులను జీ కంపెనీ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ సినిమాకి 93 కోట్లు చెల్లించినట్లు తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో భారీ బిజినెస్ జరిగిందనే చెప్పాలి. ఈ చిత్రాన్ని ఏజీఎస్ స్టూడియోస్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img