- కాంగ్రెస్ పార్టీలోకి భారీగా బిఆర్ఎస్ నేతల చేరికలు
- గత అసెంబ్లీ మెజారిటి డబుల్ అయ్యేనా..!
- క్యాడర్ తో పాటు ఓట్లు పెరుగుతాయా? లేదా?
ఇదే నిజం, రామగిరి (కమాన్ పూర్) : కమాన్ పూర్ ఉమ్మడి మండలం పుట్ట మధుకు అడ్డగా పేరొందింది. పుట్ట మధు 2009 లో ప్రజారాజ్యం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నాటి నుంచి గత ఎన్నికలకు ముందు వరకు మెజారిటీ అందిస్తూ వచ్చింది. 2009 లో.. 2014లో.. 2018 లో.. ఎన్నికల్లో పుట్ట మధుకి ఆదిక్యత లభించింది. 2014 ఎన్నికల్లో పుట్ట మధుకు దాదాపు 10 వేల ఓట్లు మెజారిటీ రావడం చరిత్ర సృష్టించింది. ఈ మెజారిటీ.. పుట్ట మధు గెలుపులో, 2014 ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించింది. ఒకే ఒక్క సారి కమాన్ పూర్ ఉమ్మడి మండలం విడిపోయాక కొత్త కమాన్ పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యత లభించింది. ఇందులో కొన్ని కారణాలు ప్రతికూలంగా మారాయి అన్నది ప్రచారం.
ఇప్పుడు.. నిన్నటి దాకా పుట్ట మధు అనుచరులు గా ఉన్న వారు అందరు..రాష్ట్రంలో అధికారం మార్పిడి జరగడంతో.. అధికార కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గూటికి చేరారు. నిన్నటి దాకా జై పుట్ట మధన్న అన్న వాళ్లు నేడు జై శ్రీధర్ బాబు అనే పరిస్థితి నెలకుంది. వీరి చేరిక వాళ్ల సొంత ప్రయోజనాల కోసమేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. 5 నెలల కాలంలోనే నరం లేని నాలుక మాట మారుస్తుందని అనుకోలేదని ప్రజలు అంటున్నారు. కమాన్ పూర్ బీఆర్ఎస్ క్యాడర్ పెద్ద సంఖ్యలో చేరడం తో.. ఇక ఊరికి 10 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు మిగిలి ఉంటారని, ప్రజా స్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి కదా అని కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో చేరికల పర్వంలో సాక్షాత్తు మంత్రినే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ లెక్కనా కమాన్ పూర్ మండలం లో కాంగ్రెస్ పార్టీకి ఎంత ఆధిక్యత వస్తుందంటే. వార్ వన్ సైడ్ కావాల్సిందే కదా. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలోని కమాన్ పూర్ మండలంలో.. కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందా.. లేదా..? కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత పై ఆశలు గల్లంతు అవుతాయా? లేదా? ఎన్నికల ఫలితాలు విలువడే వరకు వేచి చూడాల్సిందే.