ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రంలో టి యు డబ్ల్యూ జే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చింతలూరి శ్రీనివాస్ పిలుపు మేరకు, గూడూరు మండల టి యు డబ్ల్యూ జె (ఐజేయు)అధ్యక్షుడు గుర్రపు యాకాంబ్రం ఆధ్వర్యంలో, ఏజెన్సీ ప్రాంతంలోని వర్కింగ్ జర్నలిస్ట్ లందరికీ, అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కు ఇచ్చే రాయితులన్నింటినీ వర్తించే విధంగా చట్టాన్ని రూపకల్పన చేయాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచి, తన జీవితాన్నే సేవా దృక్పథానికి ధారాధత్వం చేసి, తను ఉండడానికి కూడా ఒక సొంత గూడు లేనటువంటి ఈ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలంతో పాటు, ఇందిరమ్మ ఇండ్లను, వారి పిల్లలకు ఉచిత విద్యను, పదిహేను లక్షల వరకు ఆరోగ్య భీమాతో పాటుగా, ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నింటినీ, ఇంతవరకు ఎలాంటి లబ్దికి నోచుకోని ఏజెన్సీ ప్రాంతంలోని జర్నలిస్టులకు అందే విధంగా చర్యలు చేపట్టాలని, మేజర్ గూడూరు ఏజెన్సీ మండలంలోని ప్రధాన రహదారి పై, రాస్తారోకోను చేసి, స్థానిక మండల తహసిల్దార్ కార్యాలయంలోని, తహసిల్దార్ సంగు శ్వేతకు మెమోరాండాన్ని అందించి, ఏజెన్సీ ప్రాంతంలోని వర్కింగ్ జర్నలిస్టుల బాధలను డిమాండ్లను, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు తెలియజేయాలని, మా న్యాయమైన కోర్కెలను తీర్చే విధంగా కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని స్థానిక తహసిల్దార్ సంగు శ్వేతాను కోరారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యు జే (ఐ జే యు) జిల్లా ఉపాధ్యక్షులు ముక్తవరపు సత్యనారాయణ, కోరే పాపయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా గూడూరు మండల అధ్యక్షుడు గుర్రపు యాకాంబ్రం, ప్రధాన కార్యదర్శి భూక్య మంగీలాల్, మండల కమిటీ, కార్యవర్గ సభ్యులు, వర్కింగ్ జర్నలిస్టులందరూ పాల్గొన్నారు.