ఇదే నిజం,గొల్లపల్లి : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలని జీవో నెంబర్ 51 సవరించాలి. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి కేటగిల వారిగా వేతనాలను పెంచాలి. కారోబర్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలి. బకాయి వేతనాలను చెల్లించాలని తదితర సమస్యల పైన ప్రభుత్వం స్పందించి తక్షణమే గ్రామపంచాయతీ కార్మిక ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చలు జరపాలని డిసెంబర్ 6న ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఏమాత్రం సమస్యల పైన దృష్టి పెట్టినందున సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలతో పాటుగా డిసెంబర్ 27,28 తేదీల్లో రెండు రోజులపాటు టోకెన్ సమ్మె చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే 2025 జనవరి 4 తర్వాత ఏ రోజు నుండి అయినా నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జంగిలి ఎల్లయ్య, శాతాల మహేష్, తదితరులు పాల్గొన్నారు.