ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల ప్రజలకు పోలీస్ లు తెలియజేయడం ఏమనగా ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్లాలని అన్నారు. ఇస్రాజ్ పల్లి నుంచి గంగాపూర్ వెళ్లే దారి మార్గమధ్యంలో రోడ్డుపై నుంచి ఓవర్ ఫ్లో అవుతున్న కారణంగా ధర్మపురి సిఐ ఏ.రాంనర్సింహారెడ్డి, గొల్లపల్లి ఎస్ఐ సిహెచ్ సతీష్ కలిసి అటువైపు ప్రజలు మరియు ఎటువంటి వాహనాలు వెళ్లకుండా బారికేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అబ్బాపూర్ నుంచి బొంకూరు వెళ్లే దారి మధ్యలో కూడా ఓవర్ ఫ్లో అవుతున్న కారణంగా అక్కడ ఉన్న ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి అటువైపు ఎవరు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా చెరువులు, కాలువలు ఓవర్ ఫ్లో అయినట్లయితే వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది వేణు, తదితరులు పాల్గొన్నారు.