హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే శనివారం టీమిండియా, బంగ్లాదేశ్ జట్టుల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ సెంచరీతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 133 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో భారత్ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.టీ20 ఫార్మాట్‌లో పరుగుల పరంగా బంగ్లాదేశ్‌పై ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయం. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లో దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ రికార్డును ఇప్పుడు టీమిండియా బ్రేక్ చేసింది.