Homeహైదరాబాద్latest Newsటీ20 క్రికెట్ లో ఆల్ టైమ్ రికార్డు.. 166 టార్గెట్‌ 9.4 ఓవర్లలో ఉఫ్..

టీ20 క్రికెట్ లో ఆల్ టైమ్ రికార్డు.. 166 టార్గెట్‌ 9.4 ఓవర్లలో ఉఫ్..

ఇదేనిజం, స్పోర్ట్స్ డెస్క్: ఎస్ ఆర్ హెచ్ టీం మరోసారి సొంత గడ్డమీద స్వైర విహారం చేసింది. సిక్సర్లు, బౌండరీలతో మోత మోగించింది. వెరసి ఖాతాలో మరో ఘన విజయం నమోదు చేసుకున్నది. ల166 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఓపెనర్లు ఊఫ్‌మని ఊదేశారు. కేవలం 9.4 ఓవర్లలోనే వికెటే కోల్పోకుండా ఛేదించి ఈ సీజన్‌లో ఏడో విజయాన్ని అందుకుని ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. లఖ్‌నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ ఓపెనర్లరిద్దరే 9.4 ఓవర్లలోనే కరిగించేశారు. అభిషేక్ శర్మ (75; 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), ట్రావిస్ హెడ్ (89; 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఊచకోతతో ఉప్పల్ స్టేడియం బౌండరీలతో తడిసిముద్దయింది. హెడ్ 16 బంతుల్లో, అభిషేక్ 19 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు అందుకున్నారు. వీరిద్దరి ధాటికి పవర్‌ ప్లేలోనే హైదరాబాద్‌ 107/0 స్కోరు చేసింది.

Recent

- Advertisment -spot_img