అల్లరి నరేశ్(Allari Naresh) కథానాయకుడిగా సుబ్బు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బచ్చలమల్లి’. ఈ చిత్రం జనవరి 10వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సంస్థ తాజాగా వెల్లడించింది. కాగా, ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి రావడం విశేషం. ముందుగా అనుకున్న ప్రకారం, ఈ సినిమాను జనవరి 16 లేదా 17న స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. కానీ ఆ సినిమాను వారం ముందుగానే స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
ముందుగానే స్ట్రీమింగ్ కి అల్లరి నరేశ్(Allari Naresh) మూవీ
ఇటీవలి కాలంలో,పెద్ద హీరోల సినిమాలు లేదా చిన్న హీరోల సినిమాలు అనే తేడా లేకుండా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత చాలా సినిమాలు OTTలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమా నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ కావాల్సి ఉన్నప్పటికీ, థియేటర్ల రన్ ముగియడంతో సంక్రాంతి సీజన్‌లో OTTలో కూడా సినిమాకు మంచి స్పందన వస్తుందనే నమ్మకంతో వారం ముందుగానే అల్లరి నరేశ్ (Allari Naresh) మూవీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నారు.
ALSO READ
కవ్వించే చూపులతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న రాశి ఖన్నా.. పిక్స్ వైరల్..!
బాలకృష్ణ ”డాకు మహారాజ్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. ఎందుకంటే..?