Homeఆంధ్రప్రదేశ్Vizag లో ప్రభుత్వ శాఖలకు భవనాల కేటాయింపు

Vizag లో ప్రభుత్వ శాఖలకు భవనాల కేటాయింపు

– ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఇదే నిజం, ఏపీ బ్యూరో: విశాఖపట్నంలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయాలు, విడిది అవసరాలకు కూడా భవనాలను కేటాయించింది. ఆంధ్రా వర్సిటీ, రుషికొండ, చినగదిలి సమీపంలో భవనాలు కేటాయించారు. పలు శాఖలకు ఎండాడ, హనుమంత్వాక ప్రాంతాల్లో కేటాయించారు. జీఏడీ, ఆర్థిక, గ్రామవార్డు సచివాలయ, ఇంధన మినహా ఇతర శాఖలకు భవనాలు కేటాయించారు. అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం క్యాంప్​ ఆఫీసు ఎక్కడో ప్రభుత్వం జీవోలో వెల్లడించలేదు.

Recent

- Advertisment -spot_img