Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ”పుష్ప 2” సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1780 కోట్లు వసూల్ చేసింది. అయితే ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ అట్లీ, త్రివిక్రమ్ లతో సినిమా చేయనున్నాడు. తాజాగా అల్లు అర్జున్ అబుదాబిలో మెరిశారు. అబుదాబిలో ఉన్న స్వామి నారాయణ్ మందిర్ ను అల్లు అర్జున్ సందర్శించారు. ఆలయ నిర్మాణాలను అల్లు అర్జున్ ఆసక్తిగా తిలకరించారు. అక్కడి ప్రతినిధులు అల్లు అర్జున్ కి ఆలయ విశిష్టతను ప్రాముఖ్యలను వివరించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.