Allu Arjun : ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టు వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవలే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు.. ఈ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ఈ కేసులో అల్లు అర్జున్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. ఈ కేసు ఇంకా కొలిక్కి రాకముందే అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నాడు.
ఈ క్రమంలో మరోసారి అల్లు అర్జున్ కు భారీ షాక్ తగిలింది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) విజయవాడ సిటీ కౌన్సిల్, అల్లు అర్జున్ మరియు శ్రీలీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరింది. అలాగే వారిని అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేసారు. వారు కొన్ని కార్పొరేట్ కళాశాలలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, దీంతో విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని AISF ఆరోపించింది. ఈ విషయంలో వారు విద్యాసంస్థల ర్యాంకులను ధృవీకరించకుండానే ఎండార్స్‌మెంట్లు చేశారని విమర్శించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, శ్రీలీల ఇద్దరినీ అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు పెట్టాలంటూ పోలీసులకి ఫిర్యాదు చేసారు.