Allu Arjun : అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప సినిమా హిట్టుతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా తమిళ్ డైరెక్టర్ అట్లీతో చేయబోతున్నాడు. అట్లీ తీసిన ఇప్పటివరుకు తీసిన సినిమాలు అని సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ 600 కోట్లు బడ్జెట్ తో నిర్మించనుంది.
తాజాగా ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాని మల్టీస్టారర్ గా అట్లీ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని సమాచారం. ఈ సినిమాలో ట్విన్ బ్రదర్స్ గా అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ ఇలాంటి పాత్ర చేయడం మొదటిసారి కావడంతో అట్లీ బన్నీని వెండితెరపై ఎలా చూపిస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఈ నెలలోనే ప్రారభంకానున్నాయి.. అలాగే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా 2026 వేసవిలో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.