Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ”AA22” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మించబోతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా అల్లు అర్జున్ న్యూ లుక్ కోసం అట్లీ ముంబైలో కష్టాలు పడుతున్నాడు. ఇటీవలే ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో అల్లు అర్జున్ కి సంబంధించిన లుక్ టెస్ట్ మరియు కాన్సెప్ట్ ఫోటోషూట్ జరిగినట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ గెటప్‌లలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లుక్స్ అనుకున్నట్టుగా రావడం లేదు అని సమాచారం. ఈ క్రమంలో అట్లీ వివిధ లుక్స్ ను ట్రై చేస్తున్నాడు. త్వరలోనే రెండు లుక్స్ ను ఫైనల్ చేయనున్నాడు అని తెలుస్తుంది. ఈ సినిమాని దాదాపు 600 కోట్లు బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుంది.