Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రేంజ్ ”పుష్ప 2” మూవీ తరువాత మారిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి సినిమాపై కసరత్తు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అలాంటి సినిమా చేయబోతున్నాడు అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా తమిళ్ డైరెక్టర్ అట్లీ తో చేయబోతున్నారు అని అందరికీ తెలిసిందే. అట్లీ తీసిన ఇప్పటివరుకు తీసిన సినిమాలు అని సూపర్ హిట్లుగా నిలిచాయి. అట్లీ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అనే పేరు ఉంది. ”పుష్ప 2” సినిమాతో అల్లు అర్జున్ కూడా తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
అయితే తాజాగా ఈ సినిమా ఆగిపోయింది అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటరు అని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అట్లీ కి అల్లు అర్జున్ ఒక కండిషన్ పెట్టాడు అని తెలుస్తుంది. ఈ సినిమాలో ఓన్లీ తానే నటించాలి అని వేరే హీరో ఉండకూడదు అని షరతు పెట్టారు అని సమాచారం. అయితే ఈ సినిమా కధలో మార్పులు చేయడానికి అట్లీ ఒప్పుకోలేదు అని అందుకే ఈ సినిమా ఆగిపోయింది అని తెలుస్తుంది. అలాగే 600 కోట్లు బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించాల్సి ఉంది. కానీ సినిమా నుండి సన్ పిక్చర్స్ బ్యానర్ కూడా తప్పుకుంది అని సమాచారం. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో లేదా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేయబోతున్నాడు.