Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో AA22 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మించబోతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫస్ట్ హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. మరో ఇద్దరు హీరోయిన్లుగా దిశా పటానీ, శ్రద్ధా కపూర్‌లను తీసుకోవాలని చూస్తున్నారు అని సమాచారం. మరోవైపు ఈ సినిమాలో విలన్ గా హాలీవుడ్ హీరోను సంప్రదించారు అని తెలుస్తుంది.