Homeహైదరాబాద్latest NewsAllu Arjun : దేవుడు.. అల్లు అర్జున్.. త్రివిక్రమ్.. వెండితెరపై మరో అద్భుతం

Allu Arjun : దేవుడు.. అల్లు అర్జున్.. త్రివిక్రమ్.. వెండితెరపై మరో అద్భుతం

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ”పుష్ప 2” సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్టు కొట్టాడు. ఆ సినిమా తరువాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. తాజాగా మరో సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాని మైథాలజీ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్ తో తీయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నిర్మాత నాగవంశీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. త్రివిక్రమ్ అల్లు అర్జున్‌ తో మైథాలజీ సినిమా చేస్తున్నాడు అని చెప్పాడు. ఈ సినిమాని చూసి యావత్ భారతదేశం ఆశ్చర్యపోతుంది. మన పురాణాల నుండి ఒక దేవుడి గురించి చూపించబోతున్నాం. ఆ దేవుడు అందరికీ తెలుసు కానీ ఆయన జీవితం ఎలా ఉండేది, ఆయనకు ఏం జరిగిందో చాలా మందికి తెలియదు. ఈ సినిమా దాని గురించి గొప్పగా ఉండబోతోందని నాగవంశీ తెలిపారు. అయితే ఈ సినిమా సుబ్రమణ్యేశ్వరస్వామిపై తీయబోతున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

Recent

- Advertisment -spot_img