ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భారీ ట్విస్ట్‌ల మధ్య అల్లు అర్జున్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ కేసులో అల్లు అర్జున్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అలాగే రెండు నెలల పాటు ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
అయితే తాజాగా అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ మీమ్ లైక్ చేసి.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. ‘బాహుబలి 2’ రికార్డును ఇప్పుడు ‘పుష్ప 2’ బద్దలు కొట్టింది. అందులో బాహుబలిని పుష్ప ఎగిరి తన్నిన్నట్టుగా ఆ రీల్ ఉంది. అలాంటి రీల్ ను అల్లు అర్జున్ లైక్ చేశాడు. హీరో అల్లు అర్జున్ పౌ ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటివి తగ్గించుకోండి అంటూ అల్లు అర్జున్ పై ప్రభాస్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.